రొయ్యలు, మూలికలలో గంజాయి స్మగ్లింగ్.. మహిళకు 15 ఏళ్ల జైలుశిక్ష

- March 05, 2023 , by Maagulf
రొయ్యలు, మూలికలలో గంజాయి స్మగ్లింగ్.. మహిళకు 15 ఏళ్ల జైలుశిక్ష

బహ్రెయిన్: ఎండిన మూలికలు, రొయ్యలలో దాచిన కిలోగ్రాము కంటే ఎక్కువ గంజాయిని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించినందుకు కామెరూనియన్ మహిళకు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించడాన్ని అప్పీల్స్ కోర్టు తాజాగా ధృవీకరించింది. జైలు శిక్ష పూర్తయిన తర్వాత ఆమెను బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒత్తిడికి గురై యాదృచ్ఛికంగా తిరుగుతున్న మహిళను గుర్తించినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అప్పటికి అరైవల్ ప్రొసీజర్స్ కూడా పూర్తి చేసి బ్యాగ్స్ అందుకుంది. ఆమె కదలికలపై అనుమానం రావడంతో అధికారులు ఆమెను విచారణ నిమిత్తం విచారణ గదికి తరలించారు. ఆమె సంచులలో ఎండిన రొయ్యలు, మూలికలు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిర్వహించిన తనిఖీల్లో వాటిల్లో దాచిన నార్కోటిక్ గంజాయి బయటపడింది. మహిళ డ్రగ్స్ స్మగ్లింగ్, బహ్రెయిన్‌లో వాటిని ప్రమోట్ చేసే నెట్‌వర్క్‌కు చెందినది అని తమ విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com