ప్రవాస శ్రామికశక్తిలో 32% గృహ కార్మికులే
- March 05, 2023
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) గణాంకాల ప్రకారం.. కువైట్‌లోని మొత్తం ప్రవాస శ్రామికశక్తిలో గృహ కార్మికులు 32 శాతం ఉన్నారు. నివేదిక ప్రకారం.. 2022 ప్రథమార్థం నాటికి ప్రైవేట్, ప్రభుత్వ గృహ రంగాలలో మొత్తం రెండు మిలియన్ల, 170 వేల 660 మంది కార్మికులలో మొత్తం గృహ శ్రామిక శక్తి 695,173 మంది ఉన్నారు. గణాంకాల ప్రకారం.. నిర్మాణ రంగంలో నాన్-కువైట్ కార్మికులు 298,295 మంది ఉన్నారు. దాదాపు 381,368 మంది కార్మికులు హోల్‌సేల్, రిటైల్ ట్రేడ్, మెకానిక్స్ విభాగంలో పనిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, వ్యాపార సేవల విషయానికొస్తే.. 137,641 మంది ప్రవాసులు వాటిలలో పని చేస్తున్నారు. సుమారు 114,000 మంది ప్రభుత్వ రంగ ప్రభుత్వ విభాగాలు, రక్షణ మరియు సామాజిక భద్రతలో పనిచేస్తున్నారు. తయారీ పరిశ్రమలలో కువైటీయేతర కార్మికులు మొత్తం 121,958 మంది ఉండగా.. 108,469 మంది నైపుణ్యం కలిగిన వ్యక్తులు రెస్టారెంట్లు, హోటళ్లలో పనిచేస్తున్నారు. సామాజిక సేవల్లో పనిచేస్తున్న ప్రవాసులు మొత్తం 78,568 మంది ఉండగా.. వ్యవసాయ రంగంలో 57,319 మంది, లాజిస్టిక్స్ - రవాణాలో 56,790 మంది, ఆర్థిక రంగంలో 12,579 మంది, విద్యా రంగంలో 24,643 మంది పనిచేస్తున్నారు. ఆరోగ్య రంగంలో ప్రవాస కార్మికుల సంఖ్య 24,355 కాగా.. మైనింగ్‌లో 1,753, ఫిషింగ్‌లో 2,000, అంతర్జాతీయ,ప్రాంతీయ సంస్థలలో 483 మంది పనిచేస్తున్నారు. నిరుద్యోగ ప్రవాసుల సంఖ్య 3,367గా ఉందని పీఏసీఐ గణాంకాలు చెబుతున్నాయి. అలాగే నివేదించని కేసుల సంఖ్య 54,465 అని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!