ఒమన్ ఎయిర్ చేతికి 737 MAX 8 బోయింగ్ విమానాలు
- March 06, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ జాతీయ విమానయాన సంస్థ ఒమన్ ఎయిర్.. CDB ఏవియేషన్ నుండి అయిదు కొత్త బోయింగ్ 737 MAX 8 విమానాలను అందుకున్నట్లు ప్రకటించింది. 737 మ్యాక్స్ 8 CFM లీప్ 1B27 ఇంజిన్‌లను అమర్చారు. క్యారియర్ విస్తరిస్తున్న నెట్‌వర్క్‌కు అనుగుణంగా 12 బిజినెస్, 150 ఎకానమీ క్లాస్ సీట్లతో కాన్ఫిగర్ చేయబడింది. ఒమన్ ఎయిర్ ఇటీవలి సంవత్సరాలలో మధ్యప్రాచ్యం, భారత ఉపఖండం అంతటా, అలాగే యూరప్, దక్షిణాసియా, ఆఫ్రికాలోని అనేక నగరాల్లో కొత్త మార్గాలను ప్రారంభించింది. అలాగే ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాకు అదనపు కనెక్టివిటీని పెంచడంపై దృష్టి సారించింది. ఒమన్ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ అజీజ్ సౌద్ అల్ రైసీ మాట్లాడుతూ.. పాండమిక్ అనంతర విమాన ప్రయాణ డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున, ఒమన్ ఎయిర్ క్రమంగా విస్తరించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!