వాలంటీర్లను కలుసుకున్న యువ రాజ కుటుంబీకులు

- March 06, 2023 , by Maagulf
వాలంటీర్లను కలుసుకున్న యువ రాజ కుటుంబీకులు

యూఏఈ: టర్కీ, సిరియా భూకంప బాధితుల కోసం సహాయ సామాగ్రిని ప్యాకింగ్ చేస్తున్న వాలంటీర్లను యూఏఈ అధ్యక్షుడి మనవరాలు కలుసుకున్నారు. ఈ మేరకు ఫోటోలను ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ (ERC) పోస్ట్ చేసింది. అబుధాబిలోని ముబాదలా అరేనాను ప్రెసిడెంట్, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన మనవడు, మనవరాలితో కలిసి సందర్శించారు. ఆ సమయంలో భూకంప బాధితుల కోసం అవసరమైన వస్తువులను ప్యాకింగ్ చేస్తున్న వందలాది మంది వాలంటీర్లను ప్రొత్సహించారు. వినాశకరమైన భూకంపాలు సంభవించిన ఒక నెల తర్వాత తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి పోరాడుతున్న టర్కి, సిరియన్లకు ఆహారం, ఇతర అవసరమైన వస్తువులను ప్యాకింగ్ చేయడంలో యువ రాజ కుటుంబీకులు పాల్గొన్నారు. గత నెలలో సంభవించిన భూకంపం దాటికి అనేక నగరాలను నేలమట్టం అయ్యాయి. టర్కీ, సిరియాలలో 51 వేల మందికి పైగా మరణించారు. ఫిబ్రవరి 15న షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ మానవతా ప్రాజెక్టులను అమలు చేయడానికి $20 మిలియన్లు కేటాయించారు. దీంతో పాటు సిరియాకు అదనంగా $50 మిలియన్లను అందించాలని ఆదేశించారు. అంతకుముందు సిరియా, టర్కీలకు చెరో $50 మిలియన్లు అందించారు. అలాగే వేలాది టన్నుల ఆహార పదార్థాలు, వైద్య సామాగ్రి, ఇతర నిత్యావసర వస్తువులతో వందలాది విమానాలను భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరవేశారు. అదే విధంగా అత్యాధునిక ఫీల్డ్ హాస్పిటల్‌ల ద్వారా గాయపడ్డవారికి సేవలు అందించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com