వెంకటేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ‘చిలసౌ’ భామ.!
- March 07, 2023
‘చిలసౌ’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. లో బడ్జెట్, చిన్న సినిమానే అయినా ఈ సినిమాతో మంచి పేరు కొట్టేసిందీ అందాల భామ.
ఆ తర్వాత ఒకటీ అరా సినిమాల్లో నటించిందనుకోండి. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతోనూ, హాట్ హాట్ ఫోటో షూట్లతోనూ బిజీగా గడుపుతోంది. అయితే, తాజాగా ఓ సీనియర్ హీరోతో ఛాన్స్ కొట్టేసింది. ఆయన మరెవరో కాదు, విక్టరీ వెంకటేష్.
విక్టరీ వెంకటేష్ హీరోగా ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న మూవీ ‘సైంధవ్’. ఫస్ట్‌లుక్‌తోనే ఈ సినిమా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్గా రుహానీ శర్మ పేరు తెర పైకి వచ్చింది.
శైలేష్ కొలను డైరెక్షన్లో ఆల్రెడీ ‘హిట్’ సినిమాలో నటించింది రుహానీ శర్మ. మళ్లీ ‘సైంధవ్’ కోసం కూడా రుహానీనే ఎంగేజ్ చేశాడనీ తెలుస్తోంది. అయితే రుహానీ కెరీర్‌కి ఈ సినిమా ప్లస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఎంతైనా సీనియర్ హీరోతో జోడీ కడుతోందిగా.!
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









