అవెన్యూస్ మాల్లో గల్ఫ్ ట్రాఫిక్ వీక్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- March 07, 2023
కువైట్: అవెన్యూస్ మాల్లో (యువర్ లైఫ్ ఈజ్ ఎ ట్రస్ట్) అనే నినాదంతో 36వ యూనిఫైడ్ గల్ఫ్ ట్రాఫిక్ వీక్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. శుక్రవారం వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఎగ్జిబిషన్లో అనేక అవగాహన పెంచే కార్యకలాపాలు, ప్రదర్శన, ట్రాఫిక్ కెమెరాలు, సెంట్రల్ కంట్రోల్ రూమ్, ట్రాఫిక్ కంట్రోల్ కెమెరాల పనితీరును ప్రదర్శించారు. ట్రాఫిక్ సంస్కృతి స్థాయిని పెంచడానికి పిల్లలకు ట్రాఫిక్ విలువలు, చట్టాల గురించి తెలిపే అవగాహన కార్నర్‌ను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్లో జరిమానాలు చెల్లించడం, స్వాధీనం చేసుకున్న వాహనాలను విడుదల చేయడం, మూసివేసిన జరిమానాలను తెరవడం, సాధారణ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మెకానిజమ్‌ల గురించి తెలుసుకోవడం వంటివి కూడా ఉన్నాయి. ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ అల్-ఖద్దా మాట్లాడుతూ.. వాహన డ్రైవర్లకు రక్షణ కల్పించడానికి, ట్రాఫిక్ మర్యాదలు- చట్టాలను పాటించాల్సిన అవసరాన్ని కోరుతూ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని వివరించారు. వాహనాలు నడిపే క్రమలో స్పీడ్ లిమిట్స్ పాటించాలని, సీటు బెల్టులు ధరించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ప్రమాదాల దూరంగా ఉండాలని అల్-ఖద్దా సూచించారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









