చిన్నారి 'ఫైర్ గర్ల్'ని సత్కరించిన పోలీసులు
- March 08, 2023
యూఏఈ: అగ్నిప్రమాదానికి గురైన లౌలోవా నివాస సముదాయం (పెర్ల్ టవర్) పునరావాస సమయంలో రెస్క్యూ సిబ్బంది, బాధితులకు మద్దతుగా నిలిచినందుకు 'ఫైర్ గర్ల్' అనే ముద్దుపేరుతో పిలిచే చిన్నారి ఫాతిమా అల్ మజ్మీని అజ్మాన్ పోలీసులు ఘనంగా సత్కరించారు. అల్ రషీదియా ప్రాంతంలోని నివాస సముదాయంలో ఫిబ్రవరి 17న భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అజ్మాన్ పోలీసులు, సివిల్ డిఫెన్స్ సిబ్బంది చాలా కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వందలాది మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతి కల్పించారు. మొత్తం 280కిపైగా కుటుంబాలకు తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 'ఫైర్ గర్ల్' ఫాతిమా, ఆమె తల్లి ప్రతిరోజూ ప్రమాద బాధితులకు.. పోలీసు - సివిల్ డిఫెన్స్ బృందానికి అల్పాహారం అందజేశారు.
ఫాతిమా తన తండ్రి, తల్లితో కలిసి పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. అజ్మాన్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్-నైమి వారి దాతృత్వాన్ని ప్రశసించి ఘనంగా సత్కరించారు. వీరిచ్చిన అందజేసిన మద్దతు ఎమిరేట్ ప్రజల దాతృత్వాన్ని ప్రతిబింబిస్తుందని, ఇది వారి పిల్లలకు వారసత్వంగా అందించబడుతుందని తెలిపారు. సంక్షోభ సమయంలో పోలీసులకు, రెస్క్యూ టీమ్లకు మద్దతు అందించడం.. బాధితుల ప్రాణాలను కాపాడటంలో.. సమాజాన్ని రక్షించడంలో వారు చేస్తున్న ప్రయత్నాలతో పోల్చుకుంటే తాము చేసింది చాలా చిన్నదని ఫాతిమా కుటుంబసభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..