అక్రమంగా విరాళాలు సేకరణ.. మస్జీద్ ఇమామ్‌ అరెస్ట్

- March 09, 2023 , by Maagulf
అక్రమంగా విరాళాలు సేకరణ.. మస్జీద్ ఇమామ్‌ అరెస్ట్

రియాద్: అక్రమంగా నగదు, వస్తు రూపంలో విరాళాలు సేకరించినందుకు రియాద్‌కు తూర్పున ఉన్న ఒక మస్జిద్ ఇమామ్‌ను అరెస్టు చేసినట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇమామ్ మస్జీద్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు ఇనుముతో తాత్కాలిక షెల్టర్‌ను నిర్మించినట్లు గుర్తించినట్లు పేర్కొంది. అనుమతించబడిన అధికారిక మార్గాల ద్వారా మినహా నగదు, వస్తు రూపంలో విరాళాలు సేకరించడాన్ని నిషేధిస్తూ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లను ఇమామ్ ఉల్లంఘించారని తన ఉత్తర్వుల్లో మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి మంత్రిత్వ శాఖలోని సమర్థ అధికారులకు కేసు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. మస్జిద్ ఉద్యోగులు ఎవరైనా విరాళాల సేకరణలో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించినట్లయితే, మంత్రిత్వ శాఖ బెనిఫిషియరీ సర్వీసెస్ సెంటర్ (1933)కు నివేదించాలని పౌరులు, ప్రవాసులకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com