మహేష్ సినిమాకి కథ అదేనా.? డైలమాలో ఫ్యాన్స్.!
- March 09, 2023
సూపర్ స్టార్ మహేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీకి సంబంధించి ఓ తాజాగా అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ సిస్టర్ సెంటిమెంట్‌ని టచ్ చేయబోతున్నాడన్నదే ఆ అప్డేట్ సారాంశం.
అయితే, గతంలో ‘అర్జున్’ సినిమా కోసం సిస్టర్ సెంటిమెంట్ వాడి, మహేష్ బాబు బోల్తా కొట్టాడు. అలాంటిది, మళ్లీ అలాంటి రిస్క్ చేస్తాడా మహేష్.? అంటూ ఆయన అభిమానులు డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారట.
అయితే, ఇక్కడున్నది గురూజీ. ఆయన సినిమాల్ని అంత తేలిగ్గా తీసి పడేయడానికి లేదు. ఆయన ఇంతవరకూ చేసిన సినిమాలన్నింట్లోనూ ఏదో ఒక సెంటిమెంట్ చుట్టూనే కథ అల్లుకుంటాడు. ఆ సెంటిమెంట్ కూడా చాలా నేచురల్‌గా మానవ జీవితాలను టచ్ చేసేలా వుంటుంది.. అందుకే ఆయన సినిమాలకు అంతలా ప్రేక్షకులు కనెక్ట్ అవుతుంటారు.
అలాగే, మహేష్ సినిమా కోసం ఒకవేళ సిస్టర్ సెంటిమెంట్‌నే తీసుకున్నా.. గురూజీ స్టైల్ వేరే లెవల్లో వుంటుంది. అన్నట్లు ఈ సినిమాలో సిస్టర్ రోల్ కోసమే శ్రీలీలను తీసుకున్నారన్న ప్రచారం వుంది. పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు