ముకేష్ అంబానీ చెల్లిని.. వేల కోట్ల ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన లయ..!
- March 09, 2023
తెలుగు స్టార్ హీరోయిన్ గా దాదాపు 13 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఇండస్ట్రీలో కొనసాగిన హీరోయిన్ లయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక తెలుగు అమ్మాయి నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టమైన పని.. కానీ అంతమంది నార్త్ హీరోయిన్స్ మధ్య ఒక తెలుగు అమ్మాయి నిలదొక్కుకుంది అంటే ఇక ఆమె నటన ఏ విధంగా ప్రేక్షకులను అలరించిందో అర్థం చేసుకోవచ్చు. అలా స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన లయ ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించింది.
తన నటనతో అందరినీ ఆకట్టుకున్న లయ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రముఖ డాక్టర్ గణేష్ రెడ్డిని వివాహం చేసుకొని సినిమాలకు దూరం అయి దాదాపు 2017 వరకు ఐటీలో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత తన కెరియర్ను కుటుంబానికే పరిమితం చేసిన ఈమె ఇప్పుడు మళ్లీ స్ట్రాంగ్ గా ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న లయ తన ఫ్యామిలీ గురించి అలాగే తన ఆస్తి గురించి, వ్యక్తిగత విషయాల గురించి పంచుకుంది.
లయ మీడియాతో మాట్లాడుతూ.. నేను ముఖేష్ అంబానీ చెల్లిని అంటూ సరదాగా తెలిపింది. నాకు సొంత విమానం ఉంది. వేల ఆస్తులు ఉన్నాయని ఏవేవో అనుకుంటున్నారు కానీ అలాంటిదేమీ లేదు నా భర్త డాక్టర్ కావడం వల్ల మాకు మూడు హాస్పిటల్స్ ఉన్నాయి. అలా మేము ఆస్తి పరంగా బాగానే ఉన్నాము. కానీ మరి ఓన్ ఫ్లైట్ , టాటా మనవరాలిని అనేంత రేంజ్ మాది కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే చిరంజీవి గారు నాకు ఆర్థిక సహాయం చేశారనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి నేనెప్పుడూ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళలేదు.. మా నాన్న వైద్యులు .. ఆర్థికంగా మేము బాగానే ఉన్నాము.. ఓకే కూతుర్ని నచ్చింది చేశాను.. ఏ రోజు రేమ్యూనరేషన్ విషయంలో కూడా ఆలోచించలేదు అంటూ అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చింది లయ.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?