ఇండియాలో ఆస్కార్ అవార్డుల వేడుక లైవ్ టెలికాస్ట్ కు బిగ్ స్క్రీన్ లు రెడీ
- March 09, 2023
టీం ఇండియా ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో భారత క్రికెట్ అభిమానులు ఎంత ఉత్సాహంగా, ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తారో ఇప్పుడు అదే విధంగా ఇండియన్ సినీ ప్రేమికులు అంతే ఆసక్తిగా, ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కి నామినేట్ అయింది. ఈ నెల 13వ తారీఖున అవార్డుల వేడుక వైభవంగా జరగబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల కు పైగా ఆస్కార్ అవార్డుల వేడుక కార్యక్రమాన్ని లైవ్ లో చూస్తారని అంచనా వేస్తున్నారు. ఇండియా లో ముఖ్యంగా హైదరాబాదు లో ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని లైవ్ చూసేందుకు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. కొన్ని హోటల్స్ మరియు షాపింగ్ సంస్థలు ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాల కోసం బిగ్ స్క్రీన్స్ లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నాటు నాటు పాట కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ ఇండియా గర్వించే విధంగా ఆస్కార్ అవార్డును తీసుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకుంటే చూడాలని కోరికతో ఉన్నారు. అది ఎంత వరకు సాధ్యమవుతుంది అనేది చూడాలి. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు పాటకు కీరవాణి సంగీతాన్ని అందించాడు. రాజమౌళి అద్భుతమైన ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ముందు ఈ పాటను చిత్రీకరించడం జరిగింది. ఈ పాటకు అవార్డు లభిస్తే కచ్చితంగా అద్భుతం అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా అమెరికా చేరుకున్నారు. దేశం మొత్తం కూడా వారు ఆస్కార్ అవార్డు తో తిరిగి రావాలని బలంగా కోరుకుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?