బంగారం స్మగ్లింగ్: అడ్డంగా దొరికిన ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది

- March 09, 2023 , by Maagulf
బంగారం స్మగ్లింగ్: అడ్డంగా దొరికిన ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది

కొచ్చి: బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని బుధవారం కొచ్చి విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ తెలిపింది.వాయనాడ్‌కు చెందిన షఫీని 1487 గ్రాముల బంగారంతో కొచ్చిలో కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ అధికారులు అరెస్టు చేశారు. బహ్రెయిన్-కోజికోడ్-కొచ్చి సర్వీసులో క్యాబిన్ క్రూ సభ్యుడు షఫీ బంగారం తీసుకువస్తున్నట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్‌కు రహస్య సమాచారం అందింది.బంగారాన్ని చేతులకు చుట్టి, చొక్కా స్లీవ్‌ను కప్పుకుని గ్రీన్ ఛానల్ గుండా వెళుతుండగా అరెస్ట్ చేశారు.అతడిని మరింత లోతుగా విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా, సింగపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను బుధవారం చెన్నై విమానాశ్రయంలో 6.8 కిలోల బంగారాన్ని(విలువ రూ.3.32 కోట్లు) తీసుకెళ్తుండగా అరెస్ట్ చేసినట్లు చెన్నై కస్టమ్స్ విభాగం తెలిపింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రయాణికులు సింగపూర్ నుండి AI-347 మరియు 6E-52 ద్వారా చెన్నై చేరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com