GAIL లో ఉద్యోగాలు...

- March 09, 2023 , by Maagulf
GAIL లో ఉద్యోగాలు...

ఇండియాలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్‌లలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) ఒకటి. ఇందులో ఉద్యోగం పొందాలని చాలా మంది ఇంజినీర్లు కలలు కంటుంటారు.

ప్రస్తుతం ఈ మహారత్న కంపెనీ నుంచి సుమారు 120 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. గెయిల్ గ్యాస్ లిమిటెడ్ సీనియర్, జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు గెయిల్ గ్యాస్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ gailgas.com ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10న మొదలై, ఏప్రిల్ 10 సాయంత్రం 6:00 గంటలకు ముగుస్తుంది. ఖాళీల సంఖ్య ప్రాజెక్ట్ అవసరాల ఆధారంగా ఖాళీల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

ఖాళీల వివరాలు

సీనియర్ అసోసియేట్ (టెక్నికల్) 72 పోస్టులు, జూనియర్ అసోసియేట్ (టెక్నికల్) విభాగంలో 16, సీనియర్ అసోసియేట్ (ఫైర్ & సేఫ్టీ)లో 12, సీనియర్ అసోసియేట్ (మార్కెటింగ్)లో 6 ఖాళీలు ఉన్నాయి. అదే విధంగా సీనియర్ అసోసియేట్ (ఫైనాన్స్ & అకౌంట్స్) విభాగంలో 6 పోస్టులు సీనియర్ అసోసియేట్ (హ్యూమన్ రిసోర్స్)లో 6, సీనియర్ అసోసియేట్ (కంపెనీ సెక్రటరీ)లో 2 ఓపెనింగ్స్ ఉన్నాయి.

అర్హత ప్రమాణాలు

సీనియర్ అసోసియేట్ (టెక్నికల్): ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ప్రొడక్షన్/ప్రొడక్షన్ అండ్‌ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్/ మెకానికల్, ఆటోమొబైల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఏదైనా ఇతర సంబంధిత కోర్సులో ఫుల్‌ టైం ఇంజనీరింగ్‌ బ్యాచిలర్ డిగ్రీ అవసరం. కచ్చితంగా 50 శాతం మార్కులు ఉండాలి.

సీనియర్ అసోసియేట్ (ఫైర్ & సేఫ్టీ): ఈ పోస్ట్‌కు అప్లై చేసే వారికి కనీసం 50 శాతం మార్కులతో ఫైర్ లేదా ఫైర్ & సేఫ్టీలో ఇంజనీరింగ్‌లో ఫుల్‌ టైం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.

సీనియర్ అసోసియేట్ (మార్కెటింగ్): మార్కెటింగ్ లేదా ఆయిల్ & గ్యాస్/పెట్రోలియం, ఎనర్జీ/ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్/ఇంటర్నేషనల్ బిజినెస్‌లో స్పెషలైజేషన్‌తో రెండేళ్ల MBA ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు అవసరం.

ఇది కూడా చదవండి : భారతీయ డిగ్రీలకు ఆస్ట్రేలియాలో గుర్తింపు.. ఆసీస్ ప్రధాని కీలక ప్రకటన

అప్లికేషన్‌ ఫీజు, సెలక్షన్‌ ప్రాసెస్‌

జనరల్/EWS/OBC (NCL) కేటగిరీ అభ్యర్థులు తప్పనిసరిగా రూ.100 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. అయితే ST/ SC, PwBD కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సీనియర్‌ అసోసియేట్‌ పోస్ట్‌లకు రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్ అసోసియేట్‌లను రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం

సీనియర్ అసోసియేట్‌లకు సంబంధించి కన్సాలిడేట్ రెమ్యునరేషన్ నెలకు రూ.60,000. జూనియర్ అసోసియేట్‌లకు నెలకు రూ.40,000. ఇందులో పే, హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ (HRA), ఇతర అలవెన్సులు ఉంటాయి.

అభ్యర్థులు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను సబ్మిట్‌ చేస్తే, వాటిల్లో లేటెస్ట్‌ అప్లికేషన్‌ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ అంశంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవని కంపెనీ అధికారిక నోటీసులో స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com