ప్రవాస కార్మికుల స్థానిక బదిలీ సమస్యలపై చర్చించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్

- March 10, 2023 , by Maagulf
ప్రవాస కార్మికుల స్థానిక బదిలీ సమస్యలపై చర్చించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్

కువైట్: కువైట్ మార్కెట్ పరిధిలోని ప్రవాస కార్మికుల బదిలీని సులభతరం చేసే అంశంపై కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (KCCI) చర్చించింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO),ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ (IOE) అధికారులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.స్థానిక మార్కెట్‌లో కార్మికుల బదిలీని సులభతరం చేయడం, యజమానుల మధ్య స్వేచ్ఛను పెంచడం, ముఖ్యంగా విదేశాల నుండి కొత్త కార్మికులను రిక్రూట్ చేయడంలో ఉన్న ఇబ్బందులపై చర్చినట్లు ఛాంబర్ తెలిపింది. కార్మికుల సరఫరాలో కొరతను తగ్గించడం, కంపెనీలు, సంస్థల మధ్య పోటీ నేపథ్యంలో యజమాని తాను పెట్టుబడి పెట్టిన దానిని కోల్పోకుండా బదిలీలపై నియంత్రణలు ఉండాలని సమావేశాల్లో కొందరు కోరినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కువైట్‌లోని ప్రవాస కార్మికులకు సామాజిక రక్షణ, చట్టం నెం. 6(2010) పై కూడా చర్చించారు. ప్రైవేట్ రంగంలో పనికి సంబంధించి కనీస వేతనాన్ని నిర్ణయించే బాధ్యత, కార్మికుల సేవలను రద్దు చేయడానికి ముందు కార్మికుడికి మూడు నెలల వ్యవధిని ఇవ్వడం, ఎండ్-ఆఫ్-సర్వీస్ గ్రాట్యుటీ, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్, కువైట్ బ్యాంక్‌లు షెడ్యూల్ చేసిన తేదీలలో కార్మికులకు జీతాలను బదిలీ చేయడానికి ఆసక్తి చూపడం గురించి కూడా ఈ సమావేశాల్లో చర్చించినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com