డిసెంబర్ లోనే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం కేసీఆర్
- March 10, 2023
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సీఎం కేసీఆర్, పార్టీ నేతలు నివాళులు అర్పించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని ఆయన తెలిపారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికలు డిసెంబర్లో ఉంటాయని, ఆ లోపు ఎన్నికలకు ప్లాన్ చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. నాయకులంతా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో వీలైతే పాదయాత్రలు చేయాలని తెలిపారు. వీలైనన్ని ఎక్కువగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







