ఒత్తిడికి దూరంగా వుండాలంటే వీటికీ దూరంగా వుండాలి సుమా.!
- March 12, 2023
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరినీ వేధిస్తున్న సమస్య ఒత్తిడి. రకరకాల సమస్యలు, మారిన జీవన శైలి.. తదితర అంశాలను ఒత్తిడిని ప్రభావితం చేస్తున్నాయ్. దీని నుంచి తప్పించుకునేందుకు డైట్‌లో కొన్ని ఆహార పదార్ధాలను మినహాయిస్తే సరిపోతుంది.
ఒత్తిడితో బాధపడుతున్న వారు ఉప్పు తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉప్పు మానసిక ఉల్లాసాన్ని దెబ్బ తీస్తుంది. తొందరగా అలసిపోయేలా చేస్తుంది. ఉప్పు ఎక్కువగా వుండే ప్రాసెస్‌డ్ ఫుడ్, నిల్వ పచ్చళ్లు, అప్పడాలు తదితర ఆహార పదార్ధాలకు దూరంగా వుంటే మంచిది.
తీపి పదార్ధాలు శక్తి స్థాయిని ప్రభావితం చేస్తాయి. శరీర అసమతుల్యతకు దారి తీస్తుంది. తద్వారా టెన్షన్ ఎక్కువై డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ప్రమాదం వుంది. సో, చక్కెర పదార్ధాలను ఒత్తిడిలో వున్నప్పుడు అస్సలు తినకూడదని ఓ సర్వే ద్వారా తేలింది.
ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిందే. ఒత్తిడిలో వున్నప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటుంటారు కొందరు. కానీ, అది చాలా చాలా ప్రమాదకరం. మెదడులోని సెరోటోనిన్ చర్యను ఆల్కహాల్ నియంత్రిస్తుంది. తద్వారా మరింత ఆందోళన పెరుగుతుంది.
అలాగే కెఫిన్ కలిగిన పానీయాలను కూడా డిప్రెషన్‌లో వున్నప్పుడు అవైడ్ చేయాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







