సౌదీ అరేబియా దారిలోనే ఒమన్!

- March 12, 2023 , by Maagulf
సౌదీ అరేబియా దారిలోనే ఒమన్!

ఒమన్: సౌదీ అరేబియా దారిలోనే మూడు రోజుల వీకెండ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఒమన్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని సమాచారం. ఒమన్ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారాంతాన్ని మూడు రోజులకు పొడిగించడాన్ని పరిశీలిస్తోందని స్థానిక వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ మేరకు ట్విట్టర్ అభ్యర్థనకు ఒమన్ హచ్ఆర్డీ విభాగం ప్రతిస్పందించింది. ఉద్యోగాల సృష్టిని మెరుగుపరచడానికి, విదేశీ -స్థానిక పెట్టుబడిదారులకు మార్కెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి కార్మిక వ్యవస్థ చట్టాలను సవరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, మూడు రోజుల వీకెండ్ ప్రతిపాదన ప్రస్తుతం కేబినెట్ పరిశీలనలో ఉందని, త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన వస్తుందని అందరూ భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రెండు రోజుల వారాంతపు వ్యవస్థను విడిచిపెట్టిన మొదటి GCC దేశంగా యూఏఈ నిలిచింది. యూఏఈ ప్రభుత్వం జనవరి 1, 2022న కొత్త నాలుగున్నర రోజుల పని వారాన్ని అమలు చేస్తుంది. సోమవారం నుండి గురువారం వరకు పనిదినాలు ఉదయం 7.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తాయి.  శుక్రవారం పనిదినాలు ఉదయం 7.30కి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com