స్కూల్ బస్సులో పిల్లల స్టక్ ప్రమాదాలకు చెక్!

- March 14, 2023 , by Maagulf
స్కూల్ బస్సులో పిల్లల స్టక్ ప్రమాదాలకు చెక్!

దోహా: గతేడాది స్కూల్‌ బస్సులో నాలుగేళ్ల చిన్నారి ఇరుక్కొని మరణించిన  సంఘటనపై ఖతార్‌లోని కమ్యూనిటీలు సంతాపం వ్యక్తం చేస్తుండగా.. భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరుగకుండా ఎలా నివారించాలా అని దేశంలోని ఇద్దరు పాఠశాల విద్యార్థులు ఆలోచిస్తున్నారు. అల్ అండలస్ ప్రైమరీ గర్ల్స్ స్కూల్‌కు చెందిన రానా, మహా కలిసి స్కూల్ బస్సులోకి ప్రవేశించే.. బయటికి వచ్చే విద్యార్థులను లెక్కించే పరికరాన్ని కనిపెట్టారు. రియు ఏ సమయంలోనైనా బస్సులో ఉన్న వ్యక్తుల సంఖ్యను ఈ పరికరం ద్వారా తెలుసుకోచ్చు.  KG-1 విద్యార్థి పాఠశాల బస్సులో ఊపిరాడక మరణించాడనే వార్తలను విన్నప్పుడు తమ మదిలో ఈ ఆలోచన వచ్చిందని మహా చెప్పారు. పిల్లవాడు బస్సులోకి ప్రవేశించినప్పుడు -నిష్క్రమించినప్పుడు బస్సు డోర్ వద్ద పెట్టిన పరికరం రికార్డ్ చేస్తుంది. పరికరంలో స్క్రీన్ అమర్చబడి ఉంది. ఇది బస్సులో ఉన్న వ్యక్తుల సంఖ్యను స్పష్టంగా చూపుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com