75.5% పెరిగిన రియాద్ హోటల్ ఆక్యుపెన్సీ
- March 14, 2023
రియాద్: హోటల్ పరిశ్రమ పర్యవేక్షణ సంస్థ STR ప్లీనరీ డేటా ప్రకారం.. రియాద్ హోటల్ ఆక్యుపెన్సీ రేటు ఫిబ్రవరిలో 75.5 శాతానికి చేరుకుంది. ఇది 2008 నుండి అత్యధికం. 2019తో పోలిస్తే ఆక్యుపెన్సీ 23.4 శాతం పెరిగింది. అలాగే సగటు రోజువారీ రేటు 34 శాతం పెరిగి SR801.46 ($213.46)కి చేరుకుంది. అదే విధంగా అందుబాటులో ఉన్న గదికి ఆదాయం 65.3 శాతం పెరిగి SR605.06 వద్దకు చేరుకుందని అనలిటిక్స్ సంస్థ కోస్టార్ గ్రూప్ తెలిపింది.
ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 8 వరకు వరుసగా మూడు రోజుల పాటు మార్కెట్ ఆక్యుపెన్సీ రేటు 90 శాతానికి పైగా నమోదు చేసిందని డేటా వెల్లడించింది. జనవరిలో STR విడుదల చేసిన డేటా ప్రకారం.. మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో హోటల్ కార్యకలాపాలు 2022 చివరిలో పెరిగాయి. డిసెంబరులో ఈ ప్రాంతంలో 238,635 హోటల్ గదులు ఒప్పందంలో ఉన్నాయని, 2021లో అదే నెలలో 1.1 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో యూరప్ 11.2 శాతం తగ్గగా.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 5.4 శాతం తగ్గుదల, అమెరికా 3.2 శాతం పతనం అయింది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో 40,742 హోటల్ గదుల నిర్మాణంతో సౌదీ అరేబియా ముందు ఉంది. 27,456 గదులతో యూఏఈ రెండవ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!