ట్రెక్కింగ్ సమయంలో ప్రమాదాల నివారణకు 10 చిట్కాలు

- March 14, 2023 , by Maagulf
ట్రెక్కింగ్ సమయంలో ప్రమాదాల నివారణకు 10 చిట్కాలు

ఒమన్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పర్యాటకులకు, నివాసితులకు సురక్షితమైన స్వర్గధామం. తక్కువ నేరాల రేట్లు, విశాలమైన రోడ్లు, అత్యున్నతమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.  మీరు ఈ అందమైన దేశంలోని అందమైన ట్రైల్స్, భూభాగాల దగ్గరకు వెళ్లినప్పుడు గుర్తుంచుకోవలసిన టాప్ 10 పాయింట్లు ఇక్కడ ఉన్నాయి.

1. ఒంటరిగా ట్రెక్కింగ్ వద్దు: మీరు ట్రెక్కింగ్‌కు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ మీతో ఒక స్నేహితుడిని లేదా గైడ్‌ని తీసుకెళ్లండి. మీరు చిన్న సమూహంలో ట్రెక్కింగ్ చేస్తుంటే, మీరు ఎక్కడికి వెళుతున్నారో.. ఎంతసేపు అక్కడ ఉండాలనుకుంటున్నారో ఎవరికైనా చెప్పండి. అనేక దేశాలు ఒంటరి ట్రెక్కింగ్‌ను అనుమతించవు. ఎందుకంటే ఇది ఒంటరిగా ఉన్న లేదా గాయపడిన హైకర్‌లను రక్షించడం కష్టమవుతుంది.

2. పిట్ నెస్: ప్రమాదకరమైన పర్వత శిఖరం చేరేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. అడ్రినలిన్-ఛార్జ్ చేయబడిన ట్రెక్కర్లు వారి శరీరాలను అందుకు అనుగుణంగా తయారు చేసుకుంటారు. ప్రతి ఒక్కరి శరీర సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. నిపుణులు చెప్పిన విధంగా సిద్ధమయ్యాకనే ట్రెక్కింగ్ కు బయలుదేరాలి.

3. ఫోటోల పట్ల జాగ్రత్త: సోషల్ మీడియా హ్యాండిల్‌ల కోసం సరైన చిత్రాల కోసం ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.

4. ఫోన్‌ ఛార్జ్ : ఒకవేళ మీరు సుదీర్ఘ ట్రెక్‌ను ప్లాన్ చేస్తుంటే, మీరు బయలుదేరే ముందు మీ ఫోన్ 100% ఛార్జింగ్ వద్ద ఉందని నిర్ధారించుకోండి. వీలయితే పవర్ బ్యాటరీలు, బ్యాకప్ బ్యాటరీలను వెంట తీసుకెళ్లాలి.

5. రూట్ ప్లాన్ : ఆన్‌లైన్‌లో అనుభవం ఉన్న ట్రెక్కింగ్ గైడ్‌ల కోసం వెతకండి. ఇంతకుముందు వెళ్లిన స్నేహితులతో మాట్లాడండి. వీలైనంత వరకు ట్రెక్కింగ్ సమయంలో గుర్తులను అనుసరించండి. ట్రాక్ నుండి దూరంగా వెళుతున్నట్లు అనిపించినా.. ప్రయాణించలేని మార్గం, ప్రదేశం ఎదరైన సందర్భంగా నిర్మోహమాటంగా వెనుకకు తిరిగి రావాలి.

6. వాతావరణం: వర్షం సూచనల సమయంలో వాడీలను దాటవద్దు. గాలులు వీస్తున్నప్పుడు పర్వత అంచులలో ట్రెక్కింగ్ చేయవద్దు. ఒమన్ వంటి సన్నీ దేశంలో వడదెబ్బ ప్రమాదం. కాబట్టి అధిక SPF సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. ఎత్తైన ప్రదేశాలలో సూర్యుడి ప్రభావం బలంగా ఉంటుంది. 

7. దిక్సూచి, విజిల్‌ : మీరు నిర్దేశించని మార్గాల్లో ట్రెక్కింగ్ చేస్తుంటే, మీ మొబైల్ ఫోన్ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కానీ దిక్సూచి అలా చేయదు. మీరు నెట్‌వర్క్ కనెక్టివిటీ లేని ప్రదేశంలో ఉన్నట్లయితే ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి విజిల్ సహాయం చేస్తుంది.

8. గేర్ అప్: మీరు బయలుదేరే ముందు ఎల్లప్పుడూ మీ గేర్‌ బాక్సును పరీక్షించాలి. మీ తాడులు బలంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. మీ బూట్లు మంచి స్థితిలో ఉండాలి.   

9. టైమ్ సెట్: సాధారణంగా, ప్రజలు గంటకు 4 కి.మీ (సగటు ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుని) చదునైన మైదానాల్లో నడుస్తారు. అదే పర్వతం ఎక్కే క్రమంలో దాదాపు 300 మీటర్ల ఎత్తులోకి చేరటానికి ఒక గంట సమయం పడుతుంది. వ్యక్తి పిట్ నెస్ స్థాయులను బట్టి వీటిల్లో కొత్త వ్యత్యాసం ఉంటుంది.

10.బీ స్మార్ట్: ప్రకృతిని గౌరవించాలి. అడవి జంతువులకు దూరంగా ఉండాలి. అత్యవసర స్నాక్స్ వెంట పెట్టుకోవాలి. ప్రథమ చికిత్స సామగ్రిని తీసుకెళ్లాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com