కువైట్ లో 21,796 మంది ప్రవాస నర్సులు

- March 14, 2023 , by Maagulf
కువైట్ లో 21,796 మంది ప్రవాస నర్సులు

కువైట్: వివిధ దేశాలకు చెందిన దాదాపు 21,796 మంది నర్సులు మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని నర్సింగ్ సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ ఇమాన్ అల్-అవాది వెల్లడించారు. మార్చి 13న గల్ఫ్ నర్సింగ్ డే సందర్భంగా కువైట్, ఇతర జిసిసి దేశాల్లోని నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ జాతీయ కేడర్ సామర్థ్యాల స్థాయిని పెంచడానికి బ్రిటిష్ సంస్థలతో శిక్షణా కార్యక్రమాలను సిద్ధం చేయడానికి ఉద్దేశించిన ప్రణాళికలు, వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. పని స్వభావం, నర్సింగ్‌లో ప్రత్యేక అలవెన్సులకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించడం, అలాగే విధానాలు -వ్యవస్థలను అప్డేట్ చేస్తామని డాక్టర్ అల్-అవధి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com