యంగ్ గ్లోబల్ లీడర్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సభ్యునిగా షేక్ మక్తూమ్

- March 15, 2023 , by Maagulf
యంగ్ గ్లోబల్ లీడర్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సభ్యునిగా షేక్ మక్తూమ్

యూఏఈ: దుబాయ్ ఉప పాలకుడు, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి, షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2023 యంగ్ గ్లోబల్ లీడర్స్ క్లాస్‌లో సభ్యునిగా ఎంపికయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కొత్తగా యంగ్ గ్లోబల్ లీడర్స్ క్లాస్‌లో దాదాపు 100 మంది ఆశాజనక రాజకీయ నాయకులు, వినూత్న పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలను కొత్తగా ఎంపిక చేసింది.  ప్రతి సంవత్సరం ఫోరమ్ ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్  పౌర సమాజం, కళలు, సంస్కృతి, ప్రభుత్వం, వ్యాపారంలో సానుకూల మార్పు కోసం కృషి చేసే 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన నాయకులను గుర్తించి ఎంపిక చేస్తుంది. 2004లో స్థాపించబడినప్పటి నుండి ఫోరమ్ ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి అత్యుత్తమ వ్యక్తుల విభిన్న కమ్యూనిటీని రూపొందించింది. షేక్ మక్తూమ్‌ను యంగ్ గ్లోబల్ లీడర్స్ క్లాస్ 2023లో చేర్చడం యువ నాయకులకు రోల్ మోడల్‌గా నిలుస్తుందని..  యూఏఈ, దుబాయ్‌లో అభివృద్ధిని పురోగమించడంలో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కొనియాడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com