ఆస్కార్ నుంచి తిరిగొచ్చిన ఎన్టీయార్ ఎమోషనల్ రెస్పాన్స్.!

- March 15, 2023 , by Maagulf
ఆస్కార్ నుంచి తిరిగొచ్చిన ఎన్టీయార్ ఎమోషనల్ రెస్పాన్స్.!

ఆస్కార్ సాధించడం చాలా ఆనందంగా వుందన్నాడు. బాధ్యత గల భారాన్ని చాలా బాధ్యతగా మోయాల్సి వచ్చింది. కోట్లాది మంది సినీ అభిమానుల ఆశల్ని మోసుకెళ్లాం.. అని అమెరికా నుంచి తిరిగొచ్చిన ఎన్టీయార్, అభిమానులనుద్దేశించి తన మనసులోని మాటల్ని వెల్లడించాడు.
ఆస్కార్ కోసం అమెరికా వెళ్లిన ఎన్టీయార్ హైద్రాబాద్‌కి తిరిగొచ్చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీయార్‌కి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆస్కార్ గెలుచుకున్న ఆనందాన్ని పై విధంగా తెలియచేశాడు ఎన్టీయార్. 
ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా ‘నాటు నాటు..’ సాంగ్ ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ‘నాటు నాటు..’ పాటతో తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపితమైంది అంతర్జాతీయ వేదికలపై. 
రాజమౌళి, ఎన్టీయార్, రామ్ చరణ్.. ఆస్కార్ కోసం పడిన కష్టం ఎట్టకేలకు ఫలించింది. తెలుగు సినిమా గొప్పతనం నిలబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com