‘దాస్ కా ధమ్కీ’కి యంగ్ టైగర్ సపోర్ట్.!
- March 15, 2023
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘ధమ్కీ’ రిలీజ్‌కి సిద్ధమైంది. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మనోడు ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశాడు.ఈ క్రమంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీయార్ ముఖ్య అతిధిగా రానున్నాడు.
ఈ నెల 17న గ్రాండ్‌గా ‘ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించింది.
ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ఠు కొట్టాలని విశ్వక్ సేన్ తాపత్రయపడుతున్నాడు. సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్లో వున్నాయని చెప్పొచ్చు.
చివరిగా ‘ఓరి దేవుడా’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన విశ్వక్ సేన్, ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయాడు. ‘ధమ్కీ’తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..