‘శాకుంతలం’ సినిమా గురించి సమంత ఏమన్నదంటే.!

- March 15, 2023 , by Maagulf
‘శాకుంతలం’ సినిమా గురించి సమంత ఏమన్నదంటే.!

సమంత లీడ్ రోల్‌లో తెరకెక్కిన చిత్రం ‘శాకుంతలం’. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, అనుకోని కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. 
ఫైనల్‌గా ఏప్రిల్‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్లు ఫిక్స్ అయ్యారు. తాజాగా హైద్రాబాద్ పెద్దమ్మ తల్లి వద్ద ఆశీర్వాదాలు తీసుకుంది ‘శాకుంతలం’ టీమ్. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. తనకు డిస్నీ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
హుందా అయిన సినిమాలెన్ని చేసినా, తనలోని చిన్నతనం లోపల అలాగే వుంటుందని క్యూట్ క్యూట్‌గా చెప్పుకొచ్చింది సమంత. ‘శాకుంతలం’ సినిమా ఒప్పుకోవడానికి అదీ ఓ కారణమని తెలిపింది.
‘శాకుంతలం’ సినిమా డిస్నీ సినిమాలాగే వుంటుందనీ, ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినందుకు సంతోషంతో కూడిన గర్వం పొందుతున్నాననీ సమంత చెప్పింది. 
అన్నట్లు ఈ సినిమాలో అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com