‘దసరా ‘ సెన్సార్ టాక్
- March 16, 2023
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ ‘దసరా’. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 30 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. రెండు గంటల ఇరవైతొమ్మిది నిమిషాల నిడివితో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు నేచురల్ లుక్ లో నాని ని చూసిన అభిమానులు..ఈ మూవీ ఊర మాస్ లుక్ లో కనిపించడమే కాదు యాక్టింగ్ కూడా అదే ఊర మాస్ గా ఉందని , ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుందని సెన్సార్ యూనిట్ చెప్పినట్లు తెలుస్తుంది.
మరోసారి కీర్తి సురేష్ తన యాక్టింగ్ తో ఆకట్టుకుందని, శ్రీకాంత్ కు ఇది మొదటి సినిమానే అయినప్పటికీ ఎన్నో సినిమాలు తీసిన నైపుణ్యం ఉన్న డైరెక్టర్ గా తెరకెక్కించాడని కితాబు ఇచ్చారు. సెన్సార్ యూనిట్ టాక్ తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ సంగీతం అందించారు. దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!