ఎక్కువ నీరు తీసుకున్నా ప్రమాదమే సుమా.!
- March 16, 2023
ఆరోగ్యంగా వుండాలంటే తగినంత నీరు త్రాగాల్సిందే అని వైద్యులు చెబుతుంటారు. కాలమేదైనా సరే, సరిపడినంత నీరు శరీరానికి అవసరం అని వైద్యులు సూచిస్తుంటారు.
అయితే, వైద్యుని సలహా మేరకు.. కొందరు సడెన్‌గా ఎక్కువ నీటిని తాగేయడం.. సడెన్‌గా తాగకుండా వుండిపోవడం వంటివి చేస్తుంటారు.
ఈ రెండూ ప్రమాదకరమే. అధిక నీరు తీసుకోవడం వల్ల మూత్ర పిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. నీటిని తీసుకుని శరీరంలోని వ్యర్ధాలను శుద్ధి చేయడమే మూత్ర పిండాలు చేసే పని. సరిపడా నీటిని తీసుకుంటే, ఆ మూత్రపిండాలి మెకానిజమ్ సవ్యంగా సాగుతుంది. అదే అధిక శాతంలో నీరు తీసుకోవడం వల్ల వాటిపై పని భారం పెరుగుతుంది.
అలాగే, అధికంగా నీటిని తీసుకోవడం.. తద్వారా మూత్రం సమస్య.. ఆపుకుంటే అదో బాధ.. పోవాలంటే ఇంకో బాధ.. తద్వారా కిడ్నీ సమస్యలు.. అందుకే తాగే నీటి మోతాదు విషయంలో కాస్త జాగ్రత్తలు పాఠించాలి సుమా.
శరీరంలో 70 శాతం నీరుంటుంది. మెదడులో 75శాతం, మూత్రపిండాల్లో 90 శాతం వుంటుంది. ఇది రక్తం (82 శాతం) కన్నా ఎక్కువే.
వైద్య సలహా ప్రకారం రోజుకు 8 నుంచి 10 గ్లాసులు.. అంటే రెండు లీటర్ల నీటిని మాత్రమే తీసుకోవాలని.. ఎండలో ఎక్కువ పని చేసే వారు ఎక్కువగా శారీరక శ్రమ చేసే వారు మాత్రం మరో రెండు గ్లాసులు ఎక్స్ట్రా తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







