'బై నౌ, పే లేటర్'కు సౌదీ సెంట్రల్ బ్యాంక్ అనుమతి
- March 17, 2023
రియాద్ : ఉత్పత్తులు, సేవలను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లకు ఫైనాన్స్ అందించడానికి సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) అనుమతించింది. సౌదీ సెంట్రల్ బ్యాంక్ చట్టం, ఫైనాన్స్ కంపెనీల నియంత్రణ చట్టం ప్రకారం.. బై నౌ, పే లేటర్ (BNPL)ను అందించే "MIS ఫార్వర్డ్"కి సౌదీ సెంట్రల్ బ్యాంక్ అనుమతిని మంజూరు చేసింది. దీంతో టర్మ్ ఫైనాన్సింగ్ ఖర్చు లేకుండా వ్యాపారుల నుండి వస్తువులను, ఉత్పత్తులను కస్టమర్లు కొనుగోళ్లు చేయవచ్చు. నియంత్రణ, పర్యవేక్షక మార్గదర్శకాలకు పూర్తి కట్టుబడి ఉంటూనే..ఆపరేషన్ కోసం రంగానికి అదనపు విలువను తీసుకురాగల కొత్త పెట్టుబడిదారులు, కంపెనీలను ఆకర్షించడం ఈ చొరవ లక్ష్యమని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. "BNPL కంపెనీలకు అనుమతులు మంజూరు చేయడం అనేది ఫిన్‌టెక్‌లోని ప్రముఖ దేశాలలో ఒకటిగా ఉండటానికి ఫిన్‌టెక్ వ్యూహం లక్ష్యాలను సాధించడానికి ఒక అడుగు."అని సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







