తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్

- March 17, 2023 , by Maagulf
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా గన్ పార్క్ వద్ద దీక్ష చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. గన్ పార్కు నుంచి ర్యాలీగా TSPSC కార్యాలయానికి బయలుదేరిన బండి సంజయ్, బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ఎదుట బీజేపీ కార్యకర్తలు భారీగా భైఠాయించారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడంతో..అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో అసెంబ్లీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

మరోపక్క ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల నేపథ్యంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. తిరిగి జూన్ 11న ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పేపర్ లీకేజీ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com