కళ్యాణ్ రామ్ దర్శకుడు ఆ మెగా ఛాన్స్ నిజమేనా.?
- March 17, 2023కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. కరోనా టైమ్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటూ, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల జోరు చూపించింది.
ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు వశిష్ట. ఆరంభమే బ్లాక్ బస్టర్ కావడంతో, ఈ నయా డైరెక్టర్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. కేవలం ఆకర్షించడమే కాదు, తన వద్ద వున్న కథలతో స్టార్ హీరోలను సైతం ఇంప్రెస్ చేస్తున్నాడు.
ఆ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఓ కథ వినిపించాడట. తను నెరేట్ చేసిన విధానానికి చరణ్ ఇంప్రెస్ అయ్యాడట. కలిసి పని చేద్దాం అని హామీ ఇచ్చాడట. ప్రస్తుతం తాను చేస్తున్న శంకర్ సినిమా పూర్తి కాగానే, బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేయాల్సి వుంది రామ్ చరణ్.
ఒకవేళ జరుగుతున్న ప్రచారమే నిజమైతే, బుచ్చిబాబు సినిమా తర్వాత వశిష్టతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చరణ్ చూడాలి మరి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ