వచ్చే వారం రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు
- March 18, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ మార్చి 19(ఆదివారం) నుండి మార్చి 23(గురువారం) వరకు ఐదు రోజుల పాటు వాయు ద్రోణి వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని పౌర విమానయాన అథారిటీ (CAA) శుక్రవారం తెలిపింది. నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ తాజా వాతావరణ అప్‌డేట్ ప్రకారం.. ఆదివారం సాయంత్రం నుండి ధోఫర్ మరియు అల్ వుస్తా గవర్నరేట్‌లలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం నుండి మిగిలిన గవర్నరేట్‌లలో వర్షాలు ప్రారంభం అవుతాయని తెలిపింది. 15 నుండి 25 kt (28-45km/h) వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్ర తీరప్రాంతాల వెంబడి సముద్రం 2-3 మీటర్ల గరిష్ట అలల ఎత్తుతో కల్లోలంగా ఉంటుంది. వర్షపాతం సమయంలో నౌకాయానం వద్దని, వాతావరణ బులెటిన్‌లు, నివేదికలను అనుసరించడం వంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఏఏ సూచించింది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!