ట్రక్ డ్రైవర్ హిట్ అండ్ రన్ కేసు.. 4 గంటల్లో డ్రైవర్ అరెస్ట్
- March 20, 2023యూఏఈ: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో ఒక అరబ్ వ్యక్తి మరణానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను 4 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండ్ తెలిపింది. శనివారం ఉదయం ఒక అరబ్ వ్యక్తిపైకి దూసుకెళ్లి అక్కడి నుంచి మరో ఎమిరేట్ వైపు పారిపోయిన ఆసియా ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున 3:55 గంటలకు ప్రమాదం జరిగిందని రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాఫిక్, పెట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ అహ్మద్ అల్-సామ్ అల్ నక్బీ తెలిపారు. ఓ వ్యక్తిని ట్రక్కు ఢీకొట్టినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందిందని చెప్పారు. పోలీసు పెట్రోలింగ్‌లు, జాతీయ అంబులెన్స్‌లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని, మృతుడు తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి అందులోంచి దిగినట్లు తేలిందని ఆయన వివరించారు. కానీ అప్రమత్తంగా ఉన్న ట్రక్కు డ్రైవర్ ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. మృతుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వెంటనే నిఘా కెమెరాల సహాయంతో షార్జాలోని ఒక ప్రాంతంలో ట్రక్కు ఉన్న ప్రదేశాన్ని గుర్తించినట్లు అల్ నక్బీ తెలిపారు. RAK పోలీసులు నేరస్థుడిని షార్జా పోలీస్ జనరల్ కమాండ్ సమన్వయంతో అరెస్ట్ చేశామన్నారు. ట్రక్ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్‌లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..