భారత్ పర్యటనకు విచ్చేసిన జపాన్ ప్రధాని
- March 20, 2023
న్యూఢిల్లీ: రెండు రోజల పర్యటన నిమిత్తం జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా భారత్కు విచ్చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో జపాన్ ప్రధానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆహ్వానం పలికారు. ప్రధాని నరేంద్ర మోడీతో కిషిదా భేటీ అయి, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
అంతర్జాతీయ పరిణామాలపైనా ఇరు ప్రధానులు చర్చింనున్నారు. జపాన్ జీ7 దేశాలకు అధక్ష్యత వహిస్తుంటే, భారత్ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోంది. దీంతో జీ7, జీ20 మధ్య సహకారంపైన కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. అంతర్జాతీయ సవాళ్లు, భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యంపై తాను చర్చించనున్నట్టు జపాన్ ప్రధాని ట్విట్టర్ లో ప్రకటించారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ పైనా కిషిదా ప్రకటన చేనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







