కువైట్ లో 2,838,613 రెసిడెన్సీ పర్మిట్లు జారీ

- March 20, 2023 , by Maagulf
కువైట్ లో 2,838,613 రెసిడెన్సీ పర్మిట్లు జారీ

కువైట్: 2022 సంవత్సరంలో మొత్తం 2,838,613 నివాస అనుమతులను ప్రవాసులకు మంజూరు చేసినట్లు కేంద్ర గణాంక శాఖ జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ నివేదిక స్పష్టం తెలిపింది. 2021 సంవత్సరంతో పోలిస్తే.. 318,000 పర్మిట్లు పెరగడం గమనార్హం. గృహ కార్మికులు, సివిల్ పని కోసం నివాస అనుమతుల్లో అత్యధిక పెరుగుదల ఉందని, గృహ కార్మికులకు 162,000 కొత్త పర్మిట్లు, ప్రైవేట్ రంగానికి 165,000 కొత్త నివాస అనుమతులు మంజూరు చేశారు. అరబ్యేతర ఆసియా దేశాల నుండి వచ్చిన ప్రవాసులకు 67.2% మొదటిసారి అనుమతులు జారీ చేసినట్లు నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. గత సంవత్సరం దేశంలోని రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిలో 27,690 మంది ప్రవాసులు ఉన్నారు. వారిలో 34% మంది డొమెస్టిక్ వర్కర్ రెసిడెన్సీ పర్మిట్‌లను కలిగి ఉండగా.. 32% మంది సందర్శకులు లేదా తాత్కాలిక నివాస వీసాలపై కువైట్ లోకి ప్రవేశించిన వారు ఉన్నారు. 2022లో రెసిడెన్సీ ఉల్లంఘించిన వారి సంఖ్య గత మూడేళ్లలో అత్యల్పంగా నమోదు అయిందని నివేదిక పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com