120 మిలియన్ల సందర్శకులతో సౌదీ వినోద రంగం రికార్డు

- March 20, 2023 , by Maagulf
120 మిలియన్ల సందర్శకులతో సౌదీ వినోద రంగం రికార్డు

రియాద్: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ మద్దతు, సాధికారతతో సౌదీ అరేబియా వినోద రంగం మహర్దశకు చేరుకుందని జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్, రాయల్ కోర్ట్ సలహాదారు టర్కీ అల్ అల్-షేక్ వెల్లడించారు.  2019 నుండి  2023 మొదటి త్రైమాసికం వరకు 120 మిలియన్లకు పైగా సందర్శకులను సౌదీ వినోద రంగం ఆకర్షించిందని చెప్పారు. ఈ కాలంలో అథారిటీ సాధించిన వాటిలో ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్ర ఖురాన్, అజాన్ పోటీలను నిర్వహించడంతోపాటు 2019లో కొత్త లైసెన్సింగ్ సిస్టమ్‌ను ప్రారంభించిన తర్వాత వివిధ వినోదం, సహాయక కార్యకలాపాల కోసం 11,136 లైసెన్స్‌లను జారీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. రాజ్యంలో 42 నగరాలు,  గవర్నరేట్‌లలో 470 వినోద గమ్యస్థానాలు లైసెన్స్ పొందాయిన తెలిపారు. 50 నగరాలు, గవర్నరేట్‌లలో కనీసం 3,728 పర్మిట్‌లతో 1,402 రెస్టారెంట్లు లైసెన్స్‌లు పొందగా, వినోదం - సహాయక కార్యకలాపాలకు సంబంధించిన 3,738 స్థాపనలకు లైసెన్స్‌లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇదే కాలంలో కార్యకలాపాల సంఖ్య 8,732కి చేరుకుందని అల్-షేక్ తెలిపారు. వీటిలో వినోద కార్యక్రమాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఉన్నాయన్నారు. 1,381 కచేరీలతో సహా మొత్తం ఈవెంట్ రోజుల సంఖ్య 76,000 కంటే ఎక్కువ చేరిందని ఆయన వివరించారు. సౌదీలో వినోద పరిశ్రమలో అత్యంత ప్రముఖమైన ఆర్ట్ ఫెస్టివల్స్‌లో ఒకటైన జాయ్ అవార్డ్స్ మూడు ఎడిషన్‌లలో జరిగింది. ఫుట్‌బాల్ విషయానికొస్తే మారడోనా కప్, రియాద్ సీజన్ కప్ జరిగాయి. అరేబియా గుర్రాల అందాల పోటీని అథారిటీ నిర్వహించింది. దీంతోపాటు "రామేజ్" చిలిపి ప్రదర్శన, "తాష్ మా తాష్" సిరీస్, "సౌదీ ఐడల్" టాలెంట్ షో, "బాడీగార్డ్" నాటకం వంటి అనేక టెలివిజన్ షోలు సందర్శకులను విపరీతంగా ఆకర్షించాయి. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ఆధునికమైన "మెర్వాస్" ఆర్ట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టరీ కూడా మ్యూజిక్ రికార్డింగ్, పోడ్‌కాస్టింగ్, సినిమాటోగ్రఫీ అభిమానులను ఆకట్టుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com