మెస్సీ అభిమానికి ఇంటిని బహుమతిగా ఇచ్చిన దుబాయ్‌ వ్యాపారవేత్త

- March 20, 2023 , by Maagulf
మెస్సీ అభిమానికి ఇంటిని బహుమతిగా ఇచ్చిన దుబాయ్‌ వ్యాపారవేత్త

యూఏఈ: కేరళలోని ఒక రైతుకు ఫుట్‌బాల్ ఆకారంలో ఉన్న ఇంటిని దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త బహుమతిగా ఇచ్చారు. ఫుట్‌బాల్ ఆటపై తనకున్న గాఢమైన ప్రేమకు గౌరవసూచకంగా దుబాయ్‌లోని స్మార్ట్ ట్రావెల్ యజమాని అఫీ అహ్మద్  ఈ బ్లూ అండ్ వైట్ హోమ్ కీలను గత వారం జుబైర్ వజక్కద్‌(రైతు)కు అందజేశారు.  ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ సమయంలోనే జుబైర్ ప్రతి గేమ్‌ను తనదైన స్టయిల్ లో పరిపూర్ణ విశ్లేషణతో కేరళలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఫుట్‌బాల్ అభిమాని అయిన జుబైర్ కు 1904 నుండి జరిగిన ప్రతి ఫిఫా ప్రపంచ కప్ గేమ్‌కు సంబంధించిన గణాంకాలను నోటిపై చెప్పగలడు. జుబైర్ వజక్కద్‌ గురించి తెలుసుకున్న అఫీ అహ్మద్.. ఫుట్ బాల్ ప్రపంచ కప్ ను ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా ఖతార్ కు తీసుకువస్తానని ప్రతిపాదించారు. అయితే తన తల్లి అనారోగ్యంతో ఉన్నందున ఖతార్ వచ్చేందుకు జుబైర్ నిరాకరించాడు. ఆ సమయంలో తాను అతని కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నట్లు అఫీ అహ్మద్ తెలిపారు. అతని అభిరుచి మేరకు ఫుట్ బాల్ ఇంటిని నిర్మించి ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com