రమదాన్: యాచకులకు సహాయం చేయవద్దు..పోలీసుల హెచ్చరిక
- March 20, 2023
యూఏఈ: నవంబర్- మార్చి 2022 మధ్య వివిధ ఎమిరేట్స్‌లో పెద్ద సంఖ్యలో యాచకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భిక్షాటన చేస్తూ అనేక మంది వ్యక్తులు, బృందాలు పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. బిచ్చగాళ్లకు డబ్బు ఇవ్వవద్దని, రిజిస్టర్డ్ సంస్థల ద్వారా మాత్రమే విరాళాలు ఇవ్వాలని అధికారులు నివాసితులను కోరారు. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం సందర్భంగా పోలీసులు ఓ హెచ్చరిక జారీ చేశారు. యూఏఈలో భిక్షాటన చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని పోలీసులు గుర్తు చేశారు. యూఏఈ అంతటా రమదాన్ పవిత్ర మాసం సమయంలో యాచకులను అరికట్టడానికి పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశంలోని బయటి నుంచి వచ్చిన వ్యవస్థీకృత ముఠాల ద్వారా బిచ్చగాళ్లలో ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకున్నట్లు వివిధ ఎమిరేట్స్‌లోని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. ముఖ్యంగా పవిత్ర రమదాన్ మాసంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుందన్నారు.
గత సంవత్సరం రమదాన్ సందర్భంగా దుబాయ్ పోలీసులు 382 మంది యాచకులు, 222 మంది వీధి వ్యాపారులతో సహా 604 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అథారిటీ భిక్షాటనకు సంబంధించిన నివాసితుల నుండి 2,235 నివేదికలను అందుకుంది. ఇందులో (901) కాల్ సెంటర్ ద్వారా 1,956 నివేదికలు, 'పోలీస్ ఐ' సేవ ద్వారా 279 నివేదికలు ఉన్నాయి. భిక్షాటనను అరికట్టడానికి, దాని ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి కమ్యూనిటీ సభ్యులకు అధికారిక, మార్గనిర్దేశం చేసేందుకు పోలీసులు తమ వార్షిక యాచక వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించినట్లు జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌లోని యాంటీ ఇన్‌ఫిల్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ అలీ సలేం సయీద్ అల్ షమ్సీ తెలిపారు.
యాచకుల గురించి ఇలా ఫిర్యాదు
అబుధాబిలో ఫోన్ ద్వారా 999 లేదా 8002626 (800అమన్), 2828కి SMS చేయండి. లేదా [email protected]కి ఇమెయిల్ చేయాలి. దుబాయ్ 901 లేదా 800243 లేదా 8004888, షార్జా 901 లేదా 06-5632222 లేదా 06-5631111లో.. రస్ అల్ ఖైమా 07-2053372లో.. అజ్మాన్ 06-7034310లో.. ఉమ్ అల్ క్వైన్ 999లో.. ఫుజైరా 09-2051100 లేదా 09-2224411 నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?