గృహిణులకు కొత్త పథకం ప్రారంభించినున్న సీఎం స్టాలిన్

- March 21, 2023 , by Maagulf
గృహిణులకు కొత్త పథకం ప్రారంభించినున్న సీఎం స్టాలిన్

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మహిళల కోసం 2023-24 వార్షిక బడ్జెట్‌లో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిన సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం మహిళల కోసం ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతినెల రూ. 1000 చొప్పున పంపిణీ చేయనున్నారు. దీని కోసం బడ్జెట్ లో రూ.7,000 కోట్లు కేటాయించింది స్టాలిన్ ప్రభుత్వం. ద్రావిడ ఐకాన్ గా పేరొందిన డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 15న సీఎం ఎంకే స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

తమిళనాడు అసెంబ్లీలో సోమవారం (మార్చి20,2023) ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఈ పథకం గురించి మంత్రి ప్రస్తావిస్తూ పలు వివరాలు వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఈ పథకం ద్వారా అమలు చేస్తున్నామని..ఈ పథకం కోసం రూ. 7,000 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇటీవల కాలంలో పలుమార్లు భారీగా పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న గృహిణులకు ఈ పథకం ద్వారా కొంత ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా అర్హులైన మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. కాగా.. అర్హులైన మహిళల ఎంపిక ఎలా అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

కాగా డీఎంకే పార్టీని స్థాపించిన అన్నాదురై 1967-69మధ్య తమిళనాడు సీఎంగా పనిచేశారు. భారతదేశం స్వాతంత్రం పొందాక దేశంలోనే మొదటి కాంగ్రేసే ఏతర ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. సెప్టెంబర్ 15న అన్నాదురై జయంతి సందర్భంగా సీఎం స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. డీఎంకే చేసిన ఎన్నికల హామీల్లో ఇదొకటిగా ఉంది. స్టాలిన్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి 2023-24 బడ్జెట్ లో ప్రవేశ పెట్టి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com