టాప్-10లో చోటు కోల్పోయిన రఫెల్ నాదల్..
- March 21, 2023టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌లో ఒకడైన రఫెల్ నాదల్ తాజాగా టాప్-10 జాబితాలో చోటు కోల్పోయాడు.నాదల్ ఇలా టాప్-10లో చోటు దక్కించుకోకపోవడం 2005 తర్వాత ఇదే తొలిసారి. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో దాదాపు 17 ఏళ్లకు పైగా అతడు టాప్-10లో కొనసాగాడు.
ఏటీపీకి సంబంధించిన ర్యాంకింగ్స్ సోమవారం వెల్లడయ్యాయి.దీని ప్రకారం అతడు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు తొమ్మిదో స్థానంలో ఉండేవాడు. తాజాగా 4 స్థానాలు దిగజారాడు.దీంతో 912 వారాలపాటు టాప్-10లో కొనసాగిన అతడి జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లైంది. క్యాలిఫోర్నియాలో జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నమెంట్‌కు అతడు దూరమవ్వడం వల్ల పాయింట్లు తగ్గాయి. తన 600 పాయింట్లను అతడు నిలుపులేకపోయాడు. దీంతో టాప్-10 నుంచి కిందికి దిగజారాడు. స్పెయిన్ దిగ్గజ ఆటగాడైన నాదల్ తన కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ టైటిళ్లు గెలుపొందాడు.
కొంతకాలంగా నాదల్ ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో తాజా టోర్నీకి దూరమయ్యాడు. అయితే, త్వరలో జరగబోయే ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తా చాటితే మళ్లీ తిరిగి టాప్‌లోకి చేరే అవకాశం ఉంది.ఇప్పటికే నాదల్ 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకుని ఉన్నాడు.దీంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ విజయం సాధించి మళ్లీ తన సత్తా నిరూపించుకునే అవకాశం ఉంది. టెన్నిస్‌కు సంబంధించి సెరెనా విలియమ్స్, రోజర్ ఫెదెరర్ గత ఏడాది వీడ్కోలు చెప్పగా, నాదల్, జకోవిచ్ మాత్రం ఇంకా కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు