రమదాన్: దుబాయ్‌లో పెయిడ్ పార్కింగ్, మెట్రో సమయాల్లో మార్పులు
- March 22, 2023
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా దుబాయ్‌లో పెయిడ్ పార్కింగ్ సమయాన్ని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. పబ్లిక్ పార్కింగ్ రుసుములు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు.. రాత్రి 8 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు వర్తిస్తాయని ప్రకటించింది. TECOM ప్రాంతంలో (F కోడ్‌తో పార్కింగ్) సమయాలు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. మల్టీ-లెవల్ పార్కింగ్ టెర్మినల్స్ 24 గంటల పాటు పనిచేయనున్నాయి. పవిత్ర మాసంలో ఆర్టీఏ తన అన్ని సేవల పని వేళల్లో మార్పులు చేసింది.
మెట్రో, ప్రజా రవాణా
పవిత్ర రమదాన్ మాసంలో దుబాయ్ మెట్రో సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 5 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు నడుస్తాయి. శుక్రవారం రైళ్లు ఉదయం 5 నుండి మధ్యాహ్నాం 1 వరకు; శనివారం ఉదయం 5 నుండి అర్ధరాత్రి 12 వరకు; ఆదివారం ఉదయం 8 నుండి అర్ధరాత్రి 12 వరకు నడుస్తాయి. దుబాయ్ ట్రామ్ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6 నుండి మధ్యాహ్నాం 1 వరకు పనిచేస్తుంది. ఆదివారం ఉదయం 9 నుండి 1 వరకు.. బస్ స్టేషన్లు ఉదయం 6 నుండి 1 గంటల వరకు తెరిచి ఉంటాయి.
కస్టమర్ సేవా కేంద్రాలు
కస్టమర్ సేవా కేంద్రాలు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి. అలాగే శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు పనిచేస్తాయి. ఉమ్మ్ రమూల్, అల్ మనారా, దీరా, అల్ బర్షా, ఆర్టీఏ ప్రధాన కార్యాలయం వద్ద స్మార్ట్ కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు 24 గంటలూ యధావిధిగా పనిచేస్తాయి.
వాహన పరీక్ష కేంద్రాలు
తస్జీల్ జెబెల్ అలీ: సోమవారం నుండి గురువారం మరియు శనివారం ఉదయం 7 నుండి సాయంత్రం 4 వరకు; శుక్రవారం ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తాయి.
హట్టా: సోమవారం నుండి గురువారం, శనివారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 వరకు; శుక్రవారం రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు నడుస్తాయి.
అల్ ముతకమేలా అల్ క్యూజ్, వాసెల్ అల్ జద్దాఫ్, నాద్ అల్ హమర్, తమమ్ అల్ కిండి, కార్స్ అల్ మమ్జార్, కార్స్ దీరా, తస్జీల్ డిస్కవరీ, అల్ అవీర్, ఆటోప్రో అల్ సత్వా, ఆటోప్రో అల్ మంఖూల్, తస్జీల్ అల్ తవార్: సోమవారం నుండి గురువారం, శనివారం ఉదయం షిఫ్ట్ ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు; సాయంత్రం 8 గంటల నుండి అర్ధరాత్రి 12 వరకు; శుక్రవారం ఉదయం షిఫ్టు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శుక్రవారం సాయంత్రం షిఫ్ట్ రాత్రి 8 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఉంటుంది.
తస్జీల్ అల్ ఖుసైస్, తస్జీల్ అల్ బార్షా, తస్జీల్ అల్ వార్సన్: సోమవారం నుండి గురువారం, శనివారం వరకు ఉదయం 8 నుండి అర్ధరాత్రి 12 వరకు; శుక్రవారం ఉదయం షిఫ్ట్ ఉదయం 8 నుండి 12 మధ్యాహ్నం వరకు; శుక్రవారం సాయంత్రం షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుండి అర్ధరాత్రి 12 వరకు నడుస్తాయి.
షామిల్ అల్ అధేద్, షామిల్ ముహైస్నా, షామిల్ నాద్ అల్ హమర్, షామిల్ అల్ ఖుసైస్, తజ్దీద్, వాస్ల్ అల్ అరబి సెంటర్, అల్ ముమయాజ్ అల్ బర్షా, అల్ ముమయాజ్ అల్ మిజార్, తస్జీల్ మోటార్ సిటీ, తస్జీల్ అరేబియన్ సిటీ, అల్ యాలేస్, అల్ ముతకమేలా, అల్ అవీర్: సోమవారం నుండి గురువారం, శనివారం వరకు ఉదయం షిఫ్ట్ ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు, సాయంత్రం షిఫ్ట్ రాత్రి 8 నుండి అర్ధరాత్రి 12 వరకు ఉంటాయి. శుక్రవారం ఉదయం షిఫ్టు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం షిఫ్టు రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఉంటుందని ఆర్టీఏ ప్రకటించింది.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం