రమదాన్: ఒమన్‌లో అధికారిక పని గంటలు రీషెడ్యూల్
- March 22, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా సివిల్ స్టేట్, ప్రైవేట్ రంగ సంస్థల పరిపాలనా యంత్రాంగానికి చెందిన యూనిట్లలోని ఉద్యోగుల అధికారిక పని గంటలను రీ షెడ్యూల్ చేశారు. కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
1. సివిల్ స్టేట్ పరిపాలన యూనిట్స్: అధికారిక పని గంటలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. అదే విధంగా ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు.. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉద్యోగులకు అనుకూలమైన షిఫ్టులలో అనుమతించనున్నారు.
రిమోట్ వర్కింగ్: యూనిట్ అధిపతి ఆ యూనిట్‌లోని పని సౌలభ్యాన్ని అనుసరించి నివాసితుల కోసం రిమోట్ వర్కింగ్ ను అమలు చేస్తారు. అయితే, హాజరు తప్పనిసరి అవసరమయ్యే ఉద్యోగులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. తగ్గించకపోవచ్చు.
2. ప్రైవేట్ రంగ సంస్థలు: ప్రైవేట్ రంగ సంస్థల్లో ముస్లిం కార్మికుల పని గంటలను వారానికి 30 గంటలకు మించకుండా, రోజుకు 6 గంటలకు తగ్గించారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







