విజయవంతంగా ముగిసిన BCICAI మహిళా సీఏ కాన్ఫరెన్స్‌

- March 22, 2023 , by Maagulf
విజయవంతంగా ముగిసిన BCICAI మహిళా సీఏ కాన్ఫరెన్స్‌

బహ్రెయిన్: ICAI బహ్రెయిన్ చాప్టర్(BCICAI) 3వ మహిళా CA కాన్ఫరెన్స్‌ను మార్చి 17న గల్ఫ్ హోటల్ బహ్రెయిన్‌లో విజయవంతంగా నిర్వహించింది. ప్రారంభ సెషన్‌లో బహ్రెయిన్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ పీయూష్ శ్రీవాస్తవ, ప్రాజెక్ట్ అసెస్‌మెంట్ డైరెక్టర్ నుహా సులైమాన్, లేబర్ ఫండ్ (తమ్‌కీన్), అంబాసిడర్ భార్య మోనికా శ్రీవాస్తవ, ఐసిఎఐ ప్రెసిడెంట్ సీఏ అనికేత్ తాలతి, మహిళలు & యువ సభ్యుల సాధికారత కమిటీ సీఏ ప్రీతి సవ్లా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో యువ ప్రతిభావంతుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారతదేశం, బహ్రెయిన్ నుండి పాల్గొన్న ప్రముఖులతో పలు సేషన్లను నిర్వహించారు. భారతదేశం నుండి వచ్చిన వక్తలలో స్మృతి నాగ్‌పాల్ (అతుల్యకళ వ్యవస్థాపకురాలు, ఫోర్బ్స్ 30 అండర్ 30), అభా మర్యాద బెనర్జీ (నాయకత్వ రచయిత్రి, స్పీకర్ , థాట్ ఇన్నోవేటర్), అమృత ఫడ్నవిస్ (బ్యాంకర్, గాయని, సామాజిక కార్యకర్త) ఉన్నారు. బహ్రెయిన్ నుండి వక్తలు దలాల్ అల్ ఖైస్ (గ్రూప్ సీఈఓ, బహ్రెయిన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ & ఫోర్బ్స్ ME 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా), షైఖా అల్ షైబా (ప్రఖ్యాత పారా-అథ్లెట్, మోటివేషనల్ స్పీకర్)లను లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com