3 ఏళ్ల తర్వాత రమదాన్ ప్రార్థనలకు సిద్ధమైన గ్రాండ్ మస్జీద్

- March 23, 2023 , by Maagulf
3 ఏళ్ల తర్వాత రమదాన్ ప్రార్థనలకు సిద్ధమైన గ్రాండ్ మస్జీద్

కువైట్ : నిర్వహణ పనులతో పాటు కొవిడ్ -19 మహమ్మారి కారణంగా మూడు సంవత్సరాలు మూతపడిన  గ్రాండ్ మస్జీదు రమదాన్  సందర్భంగా రాత్రి ప్రార్థనల కోసం తిరిగి తెరుచుకుంది. గ్రాండ్ మస్జీదు కువైట్‌లోని ఇస్లామిక్ సాంస్కృతిక ల్యాండ్ మార్కుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇది కువైట్‌లోని అతిపెద్ద మస్జీదుగా గుర్తింపు పొందింది. దాదాపు 45,000 చదరపు మీటర్ల విస్తీర్ణం, 60,000 కంటే ఎక్కువ మంది ఒకేసారి ప్రార్థనలు చేసే సామర్థ్యం ఉందని అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సాంస్కృతిక వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ టార్రాడ్ అల్-ఎనేజీ తెలిపారు. పవిత్ర రమదాన్ మాసం కోసం గ్రాండ్ మస్జీదు సన్నాహాల్లో భాగంగా 10 మందితో కూడిన ప్రత్యేక బృందం తారావీహ్ ప్రార్థనలు చేస్తుందని వెల్లడించారు. అదే విధంగా రమదాన్ సందర్భంగా ఖురాన్ కంఠస్థం పోటీలు, ప్రత్యేక ఈవెంట్‌లు ఉంటాయని తెలిపారు. దివంగత అమీర్ షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ చొరవతో గ్రాండ్ మస్జీదు నిర్మాణం 1979లో ప్రారంభమై.. 1986లో పూర్తయింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com