నాసాలో సౌదీ వ్యోమగాములను కలిసిన ప్రిన్సెస్ రీమా

- March 23, 2023 , by Maagulf
నాసాలో సౌదీ వ్యోమగాములను కలిసిన ప్రిన్సెస్ రీమా

వాషింగ్టన్ :  యునైటెడ్ స్టేట్స్‌లోని సౌదీ రాయబారి ప్రిన్సెస్ రీమా బింట్ బందర్ హ్యూస్టన్‌లో సౌదీ వ్యోమగాములు రేయానా బర్నావి,  అలీ అల్-కర్నీలను కలిశారు. అలీ, రేయానా లు తమ అంతరిక్ష యాత్రలో భాగంగా 11 శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారని, వారు Ax-2 స్పేస్ మిషన్ సిబ్బందితో కలిసి పాల్గొంటారని ఈ సందర్భంగా ప్రిన్సెస్ రీమా తెలిపారు. అంతకుముందు సౌదీ రాయబారి హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. మిషన్ కంట్రోల్ సెంటర్‌తో సహా అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. మొదటి అరబ్,  ముస్లిం మహిళా వ్యోమగామి రయ్యానా బర్నావి అని ప్రిన్సెస్ రీమా గుర్తు చేశారు. సౌదీ అరేబియా 2023 రెండవ త్రైమాసికంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మొదటి సౌదీ మహిళా వ్యోమగామి రేయానా బర్నావి,  సౌదీ పురుష వ్యోమగామి అలీ అల్-కర్నీని పంపుతున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com