ఒమన్‌లో 3,423 చారిత్రక ప్రదేశాలు పునరుద్ధరణ!

- March 23, 2023 , by Maagulf
ఒమన్‌లో 3,423 చారిత్రక ప్రదేశాలు పునరుద్ధరణ!

మస్కట్: ఒమన్‌లో 2022 సంవత్సరంలో 3,423 చారిత్రక ప్రదేశాలను పునరుద్ధరించినట్లు హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పునరుద్ధరించబడిన 310 చారిత్రక, పురావస్తు ప్రదేశాలలో 83 కోటలు, పురావస్తు కట్టడాలు, 145 టవర్లు, 80 మస్జీదులు ఉన్నాయని వారసత్వం, పర్యాటక మంత్రిత్వ శాఖలో పునరుద్ధరణ, నిర్వహణ డైరెక్టర్ ఇంజనీర్ అమ్జాద్ బిన్ అహ్మద్ అల్ మఖ్లాది తెలిపారు. ఒమానీ నిర్మాణ,  పురావస్తు వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు కాపాడే లక్ష్యంతో పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. పర్యాటకులను ఆకర్షించడానికి ఈ సైట్‌లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మరికొన్ని పురావస్తు ప్రదేశాల పునరుద్ధరణ, నిర్వహణ కోసం ఇప్పటికే టెండర్లను ప్రకటించామన్నారు. వీటిలో అల్ ముసన్నాలోని విలాయత్‌లోని అల్-ఓవైద్ టవర్, అల్-మఘబ్షా వాల్, అల్ సువైఖ్, సోహర్ కోటలోని విల్లాయత్‌లోని అల్-హిలాల్ వాల్, జిబ్రిన్ కోట నిర్వహణ, అల్-సీబ్ కోట పునర్నిర్మాణం, అల్-కస్ఫా టవర్ (అల్-రామా), సదా కోట నిర్వహణ-పునరుద్ధరణ ఉన్నాయని తెలిపారు. అల్-మరా కోట, అల్-మునైఖ్ కోట, ఇబ్రి కోట, అల్-ముంతరిబ్ కోట, అల్ వాసిల్ కోట,  అల్-ముసన్నా కోట వంటి ప్రధాన ప్రాజెక్టులలో పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com