వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సిఎం కెసిఆర్ పర్యటన..

- March 23, 2023 , by Maagulf
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సిఎం కెసిఆర్ పర్యటన..

ఖమ్మం: సిఎం కెసిఆర్‌ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు హెలికాఫ్టర్ లో చేరుకున్నారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్‌ నుంచే పరిశీలించారు. అనంతరం రావినూతల పంట పొలాల్లో దిగి పంట నష్టం గురించి అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఉన్నారు.

రామాపురం గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. గార్లపాడులో నష్టపోయిన రైతులతో సీఎం కెసిఆర్ మాట్లాడనున్నారు. జిల్లా కలెక్టర్ ఎంపిక చేసిన వారితో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. నష్ట పోయిన మొక్కజొన్న పంటల ఫోటో గ్యాలరీని సీఎం కెసిఆర్ పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్‌ జిల్లాకు సీఎం కెసిఆర్‌ వెళ్లనున్నారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుని దెబ్బతిన్న పంటలను సీఎం కెసిఆర్‌ పరిశీలిస్తారు. రెడ్డికుంట తండా నుంచి వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం వెల్లి అక్కడి పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బ తిన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. సిఎం కెసిఆర్‌ ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్‌ జిల్లాకు వెళ్లనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com