'ప్రాజెక్ట్ మౌసం'తో భారత్-కువైట్ సాంస్కృతిక సంబంధాలు బలోపేతం!

- March 23, 2023 , by Maagulf
\'ప్రాజెక్ట్ మౌసం\'తో భారత్-కువైట్ సాంస్కృతిక సంబంధాలు బలోపేతం!

ఢిల్లీ: భారతదేశం, కువైట్ దేశం మధ్య బలమైన సంబంధాలను.. ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు భారత విదేశాంగ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి అన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 62 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలోని కువైట్ రాయబార కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని పలువురు అధికారులు, న్యూఢిల్లీలో గుర్తింపు పొందిన అనేక మంది మిషన్ల అధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌లోని కువైట్ రాయబారి జస్సెమ్ ఇబ్రహీం అల్-నజీమ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 62 ఏళ్లు పూర్తవుతున్నాయని, రాబోయే సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య ఈ సన్నిహిత సంబంధాలు మరింత దృఢం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అరేబియా గల్ఫ్‌లోని దేశాలతో సహా హిందూ మహాసముద్రంలోని దేశాల మధ్య కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన 'ప్రాజెక్ట్ మౌసం' భారతదేశం - కువైట్ మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆయన ప్రశంసించారు. యునెస్కో సాంస్కృతిక ఒప్పందాలను వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్‌తో అనుసంధానిస్తూ, సముద్ర మార్గాలపై యునెస్కో కోసం సమగ్ర డేటాబేస్, ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించే లక్ష్యంతో జూన్ 2014లో ఖతార్‌లో ప్రారంభించబడిన 'ప్రాజెక్ట్ మౌసం'ని మీనాక్షి లేఖి పర్యవేక్షిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com