కోర్టు లో జబర్దస్త్ కామెడీ షో టీం

- May 07, 2016 , by Maagulf
కోర్టు లో జబర్దస్త్ కామెడీ షో టీం

ఈటీవీలో ప్రసారం అవుతున్న బజర్దస్త్ టీంలోని నటులు శుక్రవారం హుజూరాబాద్ సబ్ కోర్టుకు హాజరయ్యారు. పచ్చ మధు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, నాగేశ్వర్ రావు, ఫణి కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. అయితే నిర్మాత ఎం. శ్యాంప్రసాద్‌రెడ్డి, నాగబాబు, రోజా, రష్మీ, అనసూయ, మిగతా నటుల తరఫున న్యాయవాది ముక్కెర రాజు పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణకై న్యాయమూర్తి కంచె ప్రసాద్ కేసును జూన్ 30వ తేదీకి వాయిదా వేశారు.
ఈటీవీలో 'జబర్దస్త్' కార్యక్రమంలో న్యాయవాద వృత్తిని అగౌరవ పరిచేలా ప్రసారం చేయడం ద్వారా సెక్షన్ 500 ఐపీసీ ప్రకారం నేరం చేశారంటూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన న్యాయవాది అరుణ్‌కుమార్ హుజూరాబాద్ సబ్ కోర్టును కేసు దాఖలు చేశారు. ఈ కేసులో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి, సినీ నటి, ఎమ్మెల్యే రోజా, నటుడు నాగబాబు, యాంకర్లు అనసూయ, రష్మీలతోపాటు 22 మందికి సమన్లు జారీ అయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com