వేసవిలో మంచినీటి సరఫరా: మంత్రి కొల్లు రవీంద్ర
- May 07, 2016
కరువుపై ప్రభుత్వం సీరియస్ దృష్టి సారించింది. ఎండల తీవ్రతపై అన్ని జాగ్రత్తలు తీసుకొవాలి అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కోన్నారు.
విశాఖపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న మంచినీటి పథకాల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిందనితెలిపారు.
బోర్ బావులు డీపింగ్, ప్రెషింగ్..., హ్యాండ్ పంపు రిపేర్ వంటి పనులపై కూడా దృష్టి సారించాలని తెలిపారు.
ప్రభుత్వం నీరు-చెట్టు పథకం కింద పూడికతీతకు నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు.
దాదాపు 563 గ్రామాల నుంచి ప్రభుత్వం మంచినీటిని ట్రాన్స్ పోర్టు చేస్తుందని చెప్పారు. ఎండలు గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువగా ఉన్నాయన్నారు. అర్బన్ ఏరియాలో తాగునీటి సమస్య కొంద తగ్గించ కలిగాం, పట్టణ ప్రాంతాల్లో మంచినీటికి రూ.20 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పేర్కొన్నారు.
రూ. 450 కోట్ల రూపాయలతో లిఫ్టు ఇరిగేషన్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
ఉపాధీ హామీ చట్టం కింద పనులు పని కల్పిస్తామన్నారు. ప్రస్తుతం 13 లక్షల మంది రోజుకు ఉపాధీ హామీ పని చేస్తున్నారని..
అర్లీ మార్నింగ్, సాయంత్రం పని చేసే వెసులుబాటు కల్పించామని తెలిపారు. 45 రోజులపాటు మజ్జిగ పంపిణీ చేయడానికి జిల్లాకు రూ.3 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.
అందరికీ పూర్తిగా ఉపాధి కల్పిస్తామన్నారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







