కోర్టు లో జబర్దస్త్ కామెడీ షో టీం
- May 07, 2016
ఈటీవీలో ప్రసారం అవుతున్న బజర్దస్త్ టీంలోని నటులు శుక్రవారం హుజూరాబాద్ సబ్ కోర్టుకు హాజరయ్యారు. పచ్చ మధు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, నాగేశ్వర్ రావు, ఫణి కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. అయితే నిర్మాత ఎం. శ్యాంప్రసాద్‌రెడ్డి, నాగబాబు, రోజా, రష్మీ, అనసూయ, మిగతా నటుల తరఫున న్యాయవాది ముక్కెర రాజు పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణకై న్యాయమూర్తి కంచె ప్రసాద్ కేసును జూన్ 30వ తేదీకి వాయిదా వేశారు.
ఈటీవీలో 'జబర్దస్త్' కార్యక్రమంలో న్యాయవాద వృత్తిని అగౌరవ పరిచేలా ప్రసారం చేయడం ద్వారా సెక్షన్ 500 ఐపీసీ ప్రకారం నేరం చేశారంటూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన న్యాయవాది అరుణ్‌కుమార్ హుజూరాబాద్ సబ్ కోర్టును కేసు దాఖలు చేశారు. ఈ కేసులో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి, సినీ నటి, ఎమ్మెల్యే రోజా, నటుడు నాగబాబు, యాంకర్లు అనసూయ, రష్మీలతోపాటు 22 మందికి సమన్లు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







